కామారెడ్డి, మెదక్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాల ధాటికి ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. వారిని బయటకు తేవడానికి వాయు మార్గమే ఏకైక దిక్కయింది. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో 30 మంది చిక్కుకున్నారని, ప్రత్యేక హెలికాప్టర్ పంపాలంటూ రక్షణ మంత్రినిని బండి సంజయ్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రాజ్ నాథ్ సింగ్.. వైమానిక దళ హెలికాప్టర్ పంపాలంటూ హకీంపేట(Hakeempeta)లోని డిఫెన్స్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మానేరు వాగులో ఐదుగురు రైతులు చిక్కుకుపోయారు. బోట్ల ద్వారా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో డ్రోన్ల ద్వారా ఆహారం పంపించారు.