ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఈనెల 10న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు(Counting) ఉంటుంది. మొత్తం 90 స్థానాలకు షెడ్యూల్ ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) రాజీవ్ కుమార్ ప్రకటించారు. అన్ని స్థానాలకు ఒకే దఫా(Phase)లో పోలింగ్ జరగనుంది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా…
జనవరి 10….: నోటిఫికేషన్
జనవరి 17….: నామినేషన్ల చివరి తేదీ
జనవరి 18….: నామినేషన్ల పరిశీలన
జనవరి 20….: ఉపసంహరణ(Withdrawal)
ఫిబ్రవరి 05….: పోలింగ్(బుధవారం)
ఫిబ్రవరి 08….: కౌంటింగ్(శనివారం)