
వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతున్న వేళ దిల్లీలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. యమునా నదికి వస్తున్న భీకర ఫ్లడ్స్ తో దేశ రాజధానిలో భయానక వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ పెద్దయెత్తున NDRF బృందాలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని బయటకు పంపించివేస్తున్నాయి. CM కేజ్రీవాల్ ఇంటిలోకి మొత్తం నీరు వచ్చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దిల్లీలో గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్లు ఆదివారం వరకు క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అటు రవాణా పరంగా భారీ వాహనాలు, ఇతర గూడ్స్ వెహికిల్స్ రావడాన్ని బ్యాన్ చేశారు.
దిల్లీ వ్యాప్తంగా మొత్తం హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది. వర్క్ ఫ్రం హోమ్ సిస్టమ్ ను అమలు చేయాలని ప్రైవేటు సంస్థలకు కేజ్రీవాల్ సర్కారు ఆదేశాలిచ్చింది. యమునా నది వాటర్ లెవెల్ గురువారం పొద్దున్నే 208.48 మీటర్లకు చేరుకుంది. ఇది చరిత్రలోనే రికార్డు కాగా… ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఫ్లడ్ తో ఇప్పటికే దిల్లీలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి.
News composing is good. Good frame