పర్యావరణ పరిరక్షణకు ఢిల్లీ(Delhi) సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోలు వాహనాలకు ఇంధనాన్ని నిలిపివేసింది. కాలం చెల్లిన వాటికి ఇంధనం లేదంటూ అన్ని పెట్రోల్ బంకుల్లో బ్యానర్లు కట్టించింది. దేశ రాజధాని కాలుష్యంలో 51% పెట్రోల్, డీజిల్ వాహనాలదేనని 2024 డిసెంబరులో సెంటర్ ఫర్ సైన్స్ & ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. కేజ్రీవాల్ హయాంలో సరి, బేసి సంఖ్యల ఆధారంగా వెహికిల్స్ ను అనుమతిస్తే BJP సర్కారు ఏకంగా వాటినే నిషేధించింది. ఈ ఎఫెక్ట్ తో 62 లక్షల బండ్లకు ఇక ఇంధనం దొరకదు. అన్ని బంకులపై పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్ అధికారుల నిఘా ఉంచింది. https://justpostnews.com