మద్యం(Liquor) కుంభకోణం(Scam)లో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెద్ద షాక్ తగిలింది. ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తే.. దాన్ని హైకోర్టు ఆపేసింది. ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని ED(ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. మనీ లాండరింగ్ తో సంబంధం ఉన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వడం వల్ల కేసు తారుమారయ్యే ప్రమాదముందని ED వివరించింది.
హైకోర్టు ఓకే…
కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని, దీనిపై అత్యవసరం(Urgency)గా విచారించాలంటూ(Hearing) ED.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు.. ఇది తక్షణమే విచారించాల్సిన కేసు అని అభిప్రాయపడింది. తదుపరి విచారణ జరిగే వరకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులు అమలు కాబోవని స్పష్టం చేసింది.