మోకాళ్ల లోతు నీళ్లు, చెట్లు కూలడంతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi) అస్తవ్యస్థంగా మారింది. 40-60 కిలోమీటర్ల భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు.. అర్థరాత్రి నుంచి హస్తిన వాసులకు కునుకు లేకుండా చేశాయి. దీంతో అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. మోతీబాగ్, మింటో రోడ్, ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో ఎక్కడ చూసినా నీళ్లే. కేరళను రుతుపవనాలు తాకిన వారానికి గాని ఢిల్లీలో వానలు ఉండేవి కావు. 2009 తర్వాత ముందస్తుగా ఈస్థాయిలో వర్షాలు పడటం ఇదే తొలిసారి. సాధారణంగా కేరళలో జూన్ 1న మొదలై జులై 8 వరకు దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయి. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 15 కల్లా వానాకాలం పూర్తవుతుంది.