డీలిమిటేషన్ పై న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. తమిళనాడులో జరిగిన భేటీకి 5 రాష్ట్రాల నుంచి 14 మంది హాజరయ్యారు. ఆతిథ్య CM స్టాలిన్.. తెలంగాణ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ మాన్ తోపాటు BRS నుంచి KTR.. మీటింగ్ లో పాల్గొన్నారు. వచ్చే నెల హైదరాబాద్ లో రెండో సదస్సు ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
నిర్ణయాలివే…
@ జనాభా ప్రకారం చేస్తే డీలిమిటేషన్ కు ఒప్పుకునేది లేదు…
@ జనాభా ఆధారంగా కాకుండా GDP ప్రకారం ఉండాలి…
@ లోక్ సభ సీట్లను 25 ఏళ్లపాటు(2050 వరకు) పెంచొద్దు…
@ ముందుగా రాష్ట్రాల్లో అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలి…
@ జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు పెనాల్డీ ఉండొద్దు…
@ వృద్ధిరేటు, అక్షరాస్యత ఎక్కువున్న రాష్ట్రాలకు కలిగే నష్టంపై చర్చ…
@ భవిష్యత్తు జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ ఉండాలి…
@ అంతా ఏకమై కేంద్రాన్ని నిలదీయాలి…
@ సమన్వయం, భవిష్యత్తు ప్లాన్ కోసం ఢిల్లీలో ఆఫీసు ఏర్పాటు…