ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇరు పార్టీల్లో టెన్షన్ కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర భేటీ జరిగింది. BJP నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా వెళ్లి ఆపద్ధర్మ CM ఏక్ నాథ్ షిండేతో భేటీ(Meet) అయ్యారు. CM నివాసానికి వెళ్లిన ఫడ్నవీస్.. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ముచ్చటించారు. ఎల్లుండి(డిసెంబరు 5న) ప్రమాణస్వీకారం ఉన్న దృష్ట్యా ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే దీనిపై రాజీ కుదిర్చిన BJP పెద్దలు.. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కాబోయే ముఖ్యమంత్రి ఫడ్నవీసే అని ఊహాగానాలు వస్తుండగా, కమలం పార్టీలోనే మరో నేత సైతం తెరమీదకు వచ్చారు. అటు ఆరోగ్య పరీక్షల కోసం షిండే నిన్న హాస్పిటల్లో జాయిన్ అయి ఈ రోజు డిశ్చార్జి అయ్యారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకే ఫడ్నవీస్ వెళ్లారా లేక ఇందులో రాజకీయ కోణమేమైనా ఉందా అనే ప్రచారం నడుస్తున్నది.