వయసు మీరిన ప్రయాణికుల పట్ల జాగ్రత్తలు(Caring) తీసుకోవాల్సిన విమానయాన సంస్థ.. నిర్లక్ష్యం(Neglect)గా వ్యవహరించింది. కనీస ధర్మాన్ని పాటించకపోవడంతో 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ముంబయి ఎయిర్ పోర్టులోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద ఆ వృద్ధుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సదరు సంస్థపై DGCA(Director General Of Civil Aviation) తీవ్రంగా కోప్పడింది. వారం లోపు సమాధానం చెప్పాలంటూ ఆ సంస్థకు నోటీసులు పంపింది.
జరిగిన ఘటన ఇది…
CAR సెక్షన్ 3లోని సబ్ రూల్స్ ప్రకారం దివ్యాంగుల(Disability Persons)కు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత విమానయాన సంస్థలకు ఉంది. ఈ వృద్ధుడు తన సతీమణితో సహా జర్నీ చేసేందుకు న్యూయార్క్ లో వీల్ ఛైర్ టికెట్ బుక్ చేసుకున్నారు. USలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఈ గుజరాత్ జంట.. ఎయిరిండియా ఫ్లైట్ AI-116లో ఎకానమీ క్లాస్ కింద టికెట్ తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం న్యూయార్క్ లో బయల్దేరిన విమానం సోమవారం మధ్యాహ్నం 2:10 గంటలకు ముంబయి ఎయిర్ పోర్టులో దిగింది.
వీల్ ఛైర్ లేక..
విమానం దిగిన వెంటనే సదరు వృద్ధుడికి వీల్ ఛైర్ కేటాయించాల్సి ఉండగా.. ఎయిరిండియా తీసుకురాలేకపోయింది. దీంతో వేచి చూసే పరిస్థితి లేకపోవడంతో సదరు భార్యభర్త.. నడుచుకుంటూ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దాకా వెళ్లారు. అక్కడే అతడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడంతో DGCA తీవ్రంగా మండిపడింది. దీనిపై స్పందించిన ఎయిరిండియా… ఆ సమయంలో వీల్ ఛైర్ కు ఫుల్ డిమాండ్ ఉందని తెలిపింది. 32 మందికి వీల్ ఛైర్ లు అరేంజ్ చేయాల్సి ఉండగా, కేవలం 15 మాత్రమే ఉన్నాయని చెప్పింది. వారందర్నీ లాంజ్ లోకి పంపిన తర్వాత వచ్చే వీల్ ఛైర్ లో సదరు వృద్ధుణ్ని తీసుకెళ్తామని చెప్పినట్లు, కానీ అప్పటివరకు ఎందుకు టైమ్ వేస్ట్ చేయడమంటూ అతను నడుచుకుంటూ వెళ్లాడని ఎయిరిండియా వివరించింది. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న DGCA.. ఎయిరిండియాకు నోటీసులు పంపింది.