పాత పెన్షన్ విధానం(OPS)ను పునరుద్ధరించాలంటూ ఉద్యోగ సంఘాలు… పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూనే ఉన్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేసి, OPSను అమలు(Implement) చేయాలంటూ ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. జాయింట్ ఫోరం ఫర్ మూవ్ మెంట్ ఆన్ ఎడ్యుకేషన్(JFME) ఆధ్వర్యంలో బుధవారం జంతర్ మంతర్ వద్ద పెద్దయెత్తున ధర్నా జరిగింది. దేశంలోని వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, టీచర్లు ఇందులో పాల్గొని నిరసన తెలిపారు. CPI జాతీయ కార్యదర్శి డి.రాజా, CPI(M) పొలిట్ బ్యూర్ సభ్యుడు నీలోత్పల్ బసు, CITU సెక్రటరీ తైవాన్ సైన్ అటెండ్ అయి మద్దతు ప్రకటించారు. విద్యను బిజినెస్ లాగా మార్చేందుకు BJP ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చిందని, దేశ సమైక్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు చేశారు.
CPSను రద్దు చేసి పాత పెన్షన్ ను తీసుకురావడం మినహా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం(Alternative) లేదని ధర్నాకు హాజరైన ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. CPSకు GPS అని మసిపూసి మాయచేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. STFI జాతీయ ప్రధాన కార్యదర్శి CN భారతి, ఉపాధ్యక్షులు మహవీర్, చావ రవి, JFME భాగస్వామ్య సంఘాల నేషనల్ లీడర్లు ఇంద్రశేఖర్, అజిత్ నారాయణ మిశ్రా, అరుణ్ కుమార్, మహంతి మిశ్రా గుప్తా, MB సత్యం, కె.నరసింహారెడ్డి, TSUTF నాయకులు లక్ష్మారెడ్డి, అరుణకుమారి, నక్కా వెంకటేశ్వర్లు ధర్నాలో పాల్గొన్నారు.