బాలీవుడ్ యాక్టర్ సుశాంత్(Sushant) సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్(Salian) మృతి కేసు మహారాష్ట్రలో మళ్లీ వేడెక్కింది. ఐదేళ్ల నాటి ఘటనలో ఇన్నాళ్లూ ఎవరి పేరెత్తని ఆమె తండ్రి.. ఇప్పుడు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2020 జూన్ 8న ముంబయిలోని భవనంపై నుంచి దూకి ఆమె మృతిచెందారు. కొద్దిరోజులకే నటుడు సుశాంత్ తన ఫ్లాట్ లో శవమై కనిపించారు. ఇది దుమారం రేపగా, నాటి ఉద్ధవ్ ఠాక్రే సర్కారు దీన్ని కప్పిపుచ్చిందన్న ఆరోపణలున్నాయి. అత్యాచారం, హత్య, సుశాంత్ మృతిని ముడిపెడుతూ ప్రచారం జరిగింది. ఉద్ధవ్ తనయుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రేపై కేసు పెట్టాలని దిశ తండ్రి కోర్టును కోరారు. జూన్ 8న పార్టీ జరిగిందని, ఆదిత్యతోపాటు బాడీగార్డులు, నటులు సూరజ్ పంచోలి, డినో మోరియా సహా ఇంకొంతమంది హాజరయ్యారని పిటిషన్లో తెలిపారు. తమ కుమార్తెపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆరోపించారు. అటు ఫడ్నవీస్ సర్కారు సైతం.. దీనిపై SIT విచారణ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.