తమిళనాడు సీఎంకు సమాచారం లేకుండా మంత్రి వి.సెంథిల్ బాలాజీని గవర్నర్ బర్తరఫ్ చేసిన ఘటన దుమారం రేపగా.. కేవలం 5 గంటల వ్యవధిలోనే ఆర్డర్స్ ను వెనక్కు తీసుకోవడం సంచలనంగా మారింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలతోనే గవర్నర్ R.N.రవి వెనక్కు తగ్గగా… ఈ అంశాన్ని DMK సీరియస్ గా తీసుకుంటోంది. ఆర్డర్స్ ను గవర్నర్ వెనక్కు తీసుకున్నా జరిగిన ఇష్యూపై న్యాయ సలహాలను కోరే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ‘BJP చేస్తున్న రాజకీయ కుయుక్తులకు తమిళనాడులో ఎదురుదెబ్బ తగిలిందని, గవర్నర్ రివర్స్ గేరు మార్చడంతో ఆయన నిజ స్వరూపం బయటపడిందని’ DMK వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే గవర్నర్ రివర్షన్ తో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించినా… మంత్రిని తొలగిస్తూ R.N.రవి చేసిన వ్యాఖ్యలను ఈజీగా తీసుకోకూడదన్న నిర్ణయానికి ఆ పార్టీ లీడర్లు వచ్చారు. ఈ విషయంలో న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తర్వాత BJPతో ఎలా ముందుకెళ్లాలనే
దానిపై చర్చించనున్నారు.
మంత్రి బర్తరఫ్, ఆ తర్వాత ఆర్డర్స్ ని గవర్నర్ వెనక్కు తీసుకోవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపాయి. అయితే గవర్నర్ తొలుత బర్తరఫ్ ఆర్డర్స్ ని పెండింగ్ లో పెట్టగా… అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆ డిసిషన్ ను వెనక్కు తీసుకున్నారు. మంత్రివర్గం నుంచి బాలాజీని తొలగించడానికి గల రీజన్స్ ను గవర్నర్ వివరించారు.
అవినీతి ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ దర్యాప్తుతో అరెస్టయిన మంత్రి సెంథిల్ బాలాజీని DMK అంత ఈజీగా వదులుకోవట్లేదు. తమిళనాడు పశ్చిమ కొంగు ప్రాంతంలో సెంథిల్ బాలాజీ బలమైన నాయకుడు. కొన్నాళ్ల క్రితం DMKలో చేరడానికి ముందు ఆయన అన్నాడీఎంకేలో ఉండేవారు. అందుకే సెంథిల్ బాలాజీ విషయంలో DMK అధినేత, సీఎం MK స్టాలిన్ సీరియస్ గా ఉన్నారు.