ఢిల్లీ, కేరళ, ముంబయి(Mumbai), తమిళనాడు… ఇలా దేశవ్యాప్తంగా ముందస్తు వానలు దంచికొడుతున్నాయి. అంచనా వేసినదానికంటే ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వాస్తవానికి రోళ్లు పగిలే ఎండలు ఉండాల్సిన సమయంలో.. రాళ్ల వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ముంబయి జలసంద్రంగా మారింది. అక్కడ 35 ఏళ్ల తర్వాత ముందస్తు వానలు వచ్చాయి. రాబోయే కొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ(IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కేరళ, ఢిల్లీల్లో రెడ్ అలర్ట్ నడుస్తోంది.