అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.8 తీవ్రత నమోదైంది. పోర్ట్ బ్లెయిర్ ఆగ్నేయాన 126 కిలోమీటర్ల దూరంలో భూ కంప కేంద్రాన్ని గుర్తించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (NCS) ప్రకటించింది. భూమికి 69 కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించినట్లు స్పష్టం చేసింది.