Published 18 Nov 2023
మంత్రి(Minister) పదవిలో ఉన్నవారు జిల్లాల పర్యటనలకు వెళ్తే అక్కడుండే హడావుడే వేరు. డప్పుల చప్పుళ్లు, ఊరేగింపులు, అధికారుల ఘనస్వాగతాలు ఇంకేముంది.. రాజే(King) తమ దగ్గరకు వచ్చినట్లు ఒకటే హంగామా కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో అయితే ఇదంతే ఓకే. కానీ ఎన్నికల టైమ్ లో మంత్రులైనా, MLAలైనా ఒకటే అని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న టైమ్ లో మంత్రులకు ఎలాంటి ప్రొటోకాల్ ఉండదని మరోసారి స్పష్టం చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయంలో పర్యాటక MDని సస్పెండ్ చేయడంతోపాటు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ను OSD బాధ్యతలను రిమూవ్ చేయాలని చెప్పింది.
ఫుల్ క్లారిటీ
మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి టూరిజం MD మనోహర్ రావుతోపాటు OSD సత్యనారాయణ గత నెల 15, 16 తేదీల్లో తిరుమల వెళ్లినట్లు ECకి కంప్లయింట్లు వెళ్లాయి. దీనిపై రాష్ట్ర అధికారులు ఎంక్వయిరీ నిర్వహించి CECకి రిపోర్ట్ ఇచ్చారు. ఆ నివేదికను పరిశీలించిన CEC.. ఈ ఇద్దరు అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమామళి(Model Code Of Conduct)ని దాటారని గుర్తించి వారిపై వేటు వేసింది. ఎలక్షన్ల టైమ్ లో మంత్రులు కూడా సాధారణ MLAలేనని ఫుల్ క్లారిటీ ఇచ్చిన EC.. వారిని కలవడం, స్వాగతం పలకడం నిబంధనల్ని పట్టించుకోకపోవడమేనని స్పష్టం చేసింది.