ఓట్ల చోరీ జరుగుతోందంటూ ఎన్నికల సంఘంపై రాహుల్(Rahul) గాంధీ విరుచుకుపడుతుంటే.. ఇలాంటి అంశంపైనే ఆ పార్టీ కీలక నేతకు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా(Khera)కు ఢిల్లీలోనే రెండు ఓట్లున్నాయని EC గుర్తించింది. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. కేంద్రానికి మద్దతుగా నిలవడం ECకి అలవాటైందని, కర్ణాటక మహదేవపుర సెగ్మెంట్లో లక్ష దొంగ ఓట్లపై ఏం చెబుతారంటూ ఎన్నికల సంఘాన్ని పవన్ ఖేరా ప్రశ్నించారు.