సార్వత్రిక ఎన్నికల(General Elections)కు సమయం దగ్గర పడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం(CEC) కీలక నిర్ణయం తీసుకుంది. CECలో ఇద్దరు కమిషనర్లు బాధ్యతలు చేపట్టగానే ఈ నిర్ణయం వెలువడింది. లోక్ సభ తోపాటు వివిధ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల షెడ్యూల్ ను రేపు(ఈనెల 16న) విడుదల చేయనున్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ ప్రకటిస్తామని EC స్పష్టం చేసింది.
జూన్ 16న ప్రస్తుత లోక్ సభ పదవీకాలం ముగియనుండగా, ఆ లోపునే కొత్త సభను ఎన్నుకోవాల్సి ఉంటుంది. గత లోక్ సభ(17వ) ఎన్నికల్ని 2019 మార్చి 10 ప్రకటించగా, ఏడు దశల పోలింగ్ ప్రక్రియ ఏప్రిల్ 7న మొదలైంది. మే 23న కౌంటింగ్ నిర్వహించారు.