‘ఆప్’ అధినేత, అరవింద్ కేజ్రీవాల్ కు చక్కెర వ్యాధి(Sugar) ఉన్నా జైలులో మాత్రం మామిడి పండ్లు(Mangoes), స్వీట్స్(Sweets) భేషుగ్గా ఆరగించారని ED ఆరోపించింది. ఇదంతా బెయిల్ రావడం కోసం ఢిల్లీ CM ఆడిన డ్రామాగా కోర్టుకు తెలిపింది. తీపి పదార్థాలు తిని షుగర్ లెవెల్స్ పెరిగినట్లయితే బెయిల్ వస్తుందని కేజ్రీవాల్ భావించారు. అందుకనుగుణంగా మ్యాంగోలు, స్వీట్స్ తెప్పించుకుని తిన్నారు అని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వివరణ ఇచ్చారు.
ఇంటి భోజనంపై…
అయితే ED చేసిన వాదనల్ని కేజ్రీవాల్ లాయర్ వివేక్ జైన్ కొట్టిపడేశారు. ఇంటి భోజనం రాకుండా అడ్డుకోవడానికే ఈ కుట్రలు అని కోర్టు దృష్టికి తెచ్చారు. డాక్టర్ల అడ్వయిజ్ మేరకే ఆయన డైట్ తీసుకుంటున్నారని, ఇందులో ఎలాంటి అనుమానాలు(Doubts) లేవన్నారు. అయితే తన రెగ్యులర్ డాక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు పర్మిషన్ ఇవ్వాలన్న పిటిషన్ను కేజ్రీవాల్ న్యాయవాది వెనక్కు తీసుకున్నారు. ఇలా సొంత డాక్టర్ ను సంప్రదించడం కూడా బెయిల్ నాటకంలో భాగమని కోర్టుకు ED తెలిపింది.
కోర్టుకు రిపోర్ట్…
ఈడీ సమర్పించిన వివరాలపై తిహాడ్ జైలు అధికారులు ఇచ్చిన ‘డైట్ ఛార్ట్’, ‘మెడికల్ రిపోర్ట్’ను కోర్టు పరిశీలించింది. తన అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ వేసిన కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ గుప్తాతో కూడిన డివిజన్ బెంచ్(Devision Bench).. ఈ మేరకు EDకి నోటీసులు జారీ చేసి ఈ నెల 24న జవాబివ్వాలని ఆదేశించింది. ఈ నెల 29న తదుపరి వాదనలు వింటామని స్పష్టం చేసింది.