రూ.3 వేల కోట్ల మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపుపై ED దాడులకు దిగింది. ఆయనకు సంబంధించిన 35 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. 2017-19 కాలంలో యెస్(Yes) బ్యాంక్ నుంచి రూ.3 వేల కోట్ల లోన్లు తీసుకుని.. రాగా(RAAGA) కంపెనీలకు మళ్లించారన్నది ED అభియోగం. లోన్లు తీసుకునేటప్పుడు క్విడ్-ప్రో-కో(నీకింత-నాకింత) జరిగిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. యెస్ బ్యాంకు కేసు చూస్తున్న CBI నుంచి FIR అందుకున్నాక దాడులకు ED దిగింది.