విద్యారంగాన్ని మరింత విస్తరించి పిల్లల్లో సృజనాత్మకత పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. అడాప్టివ్ లెర్నింగ్(Adoptive Learning), డిజైన్ మైండ్ సైట్ వంటి అంశాలతో ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్’లో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 50 వేల సర్కారీ స్కూళ్లల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల 2025-26 బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. మొత్తంగా ఈ రంగానికి 1,28,650 కోట్లు కేటాయించారు.
అటల్ టింకరింగ్ ల్యాబ్ అంటే…
సృజనాత్మకత, అన్వేషణలే లక్ష్యంగా విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన వనరుల్ని అందించడం సహా ప్రయోగాలు చేయడానికి ఊతమిస్తుంది అటల్ టింకరింగ్ ల్యాబ్. సృష్టీకరణ, 3D ప్రింటర్ల నుంచి రోబోటిక్స్ కిట్ ల వరకు.. పరికరాల నుంచి ఎలక్ట్రానిక్స్ విడిభాగాల వరకు చేపట్టబోయే ఆవిష్కరణలకు ప్రోత్సాాహాన్నివ్వడమే(Support) పథకం ఉద్దేశం. ఈ ప్రయోగాల కోసం సంప్రదాయ తరగతి గదులకు భిన్నంగా ప్రయోగశాలలు ఏర్పాటవుతాయి. వీటివల్ల అనుభవపూర్వక అభ్యాసాన్ని(Learning) పిల్లల్లో కలిగించడమే అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉద్దేశం. క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ ను పెంచేలా ప్రయోగాత్మక ప్రాజెక్టులు స్కూళ్లల్లో చేపట్టాల్సి ఉంటుంది.
విద్యపై మిగతా నిర్ణయాలివి…
* అన్ని ప్రభుత్వ స్కూళ్లకు బ్రాడ్ బ్యాండ్ సేవలు
* అంగన్వాడీ కేంద్రాలకు నూతన హంగులు
* భారతీయ భాషల పుస్తకాలకు డిజిటల్ రూపం
* IIT, IIS విద్యార్థులకు రూ.10,000 కోట్ల స్కాలర్ షిప్స్
* జ్ఞానభారత మిషన్ ఏర్పాటు
* విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం
* అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు
* పదేళ్లలో IITల్లో విద్యార్థుల సంఖ్య రెండింతలు
* బిహార్లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ