మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే CM పదవిపై కీలక కామెంట్స్ చేశారు. BJP-శివసేన-NCP కూటమిలోని BJP భారీస్థాయిలో సీట్లు సాధించబోతుండగా.. CM పదవి ఏ పార్టీదన్న చర్చ జోరందుకుంది. మొత్తం 288 స్థానాలకు గాను NDA 225 చోట్ల లీడ్ లో ఉంటే కమలం పార్టీ సింగిల్ గానే 130 నియోజకవర్గాల్లో ఏకఛత్రాధిపత్యం సాధించినందున కాబోయే CM దేవేంద్ర ఫడ్నవీస్ అనే ప్రచారం నడుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో షిండే సంచలన రీతిలో మాట్లాడారు. ‘ఎక్కువ సీట్లు వచ్చినవాళ్లే CM కావాలని లేదు’ అని అన్నారు. అని అన్నారు.
దీంతో BJP-శివసేన మధ్య ముఖ్యమంత్రి పీఠం గొడవ ఆసక్తికరం(Interesting)గా తయారైంది. అలయెన్స్ లో ఎవరు ఎన్ని సీట్లు సాధించినా గతంలో అనుసరించిన విధానాన్నే ఫాలో(Follow) కావాలని, కాబట్టి తమ నేత ఏక్ నాథ్ షిండేకే ముఖ్యమంత్రి పగ్గాలు కట్టబెట్టాలని ఆయన పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పోరు ఇలా ఉంటే మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రెస్ మీట్లో CM షిండే, ఉప ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, అజిత్ పవార్ పాల్గొంటారు.