రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్(Schedule) వెలువడింది. దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లున్నారని, 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఎన్నికల సంఘం(CEC) తెలిపింది. లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి.
ఈ తేదీల్లో…
ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎలక్షన్లు జరుగుతాయని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే విడత పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఏప్రిల్ 19న, సిక్కింలో 19న ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయి. ఒడిశా అసెంబ్లీకి మే 13, 20 పోలింగ్ జరుగుతుంది.
తెలంగాణ షెడ్యూల్ ఇలా…
నోటిఫికేషన్…: ఏప్రిల్ 18
నామినేషన్లకు తుది గడువు…: ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన…: ఏప్రిల్ 26
ఉపసంహరణ గడువు…: ఏప్రిల్ 29
పోలింగ్…: మే 13
కౌంటింగ్…: జూన్ 4
విడతల వారీగా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ఇలా…
తొలి విడత…: ఏప్రిల్ 19 (102 నియోజకవర్గాలు)
రెండో విడత…: ఏప్రిల్ 26 (89 నియోజకవర్గాలు)
మూడో విడత…: మే 7 (94 నియోజకవర్గాలు)
నాలుగో విడత…: మే 13 (96 నియోజకవర్గాలు)
ఐదో విడత…: మే 20 (49 నియోజకవర్గాలు)
ఆరో విడత…: మే 25 (57 నియోజకవర్గాలు)
ఏడో విడత…: జూన్ 1 (57 నియోజకవర్గాలు)