ఆధార్(Aadhaar)తో ఓటరు కార్డు అనుసంధానానికి కేంద్ర ఎన్నికల సంఘం(CEC) అంగీకారం తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే ఆధార్, ఓటరు కార్డు నిపుణులు సంప్రదింపులు జరుపుతారు. EC నిర్వహించిన సమావేశానికి కేంద్ర హోంశాఖ, కార్యనిర్వాహక శాఖల కార్యదర్శులు, UIDAI సీఈవో హాజరయ్యారు.