దేశంలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించిన రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం(EC) అల్టిమేటం జారీ చేసింది. ఆరోపణలపై వారంలోగా అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే ఆ మాటలన్నీ నిరాధారమని అనుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే జరిగితే ఆయన దేశానికి క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని CEC జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar) అన్నారు. రెండు చోట్ల ఓటు ఉండటమనేది నేరమని, అయితే ఒక్క చోట మాత్రమే ఓటు వేయగలరని క్లారిటీ ఇచ్చారు.