పోలీసు బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్(Encounter)లో 12 మంది మృత్యువాత పడ్డారు. సతీశ్ పాటిల్ అనే SIకి ఎడమ భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లి గాయాపడ్డారు. చింద్ భట్టి ఫారెస్ట్ ఏరియాలోని ఝర్వాండీ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం మొదలైన ఎదురుకాల్పులు రాత్రి వరకు కొనసాగాయి.