సైన్యం, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కశ్మీర్లోని అనంత్ నాగ్(Anantnag) జిల్లా ఎహ్లాన్ గగర్మండు ప్రాంతంలో భద్రతా బలగాలు(Security Forces) కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. టెర్రరిస్టులు దాగి ఉన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో భారీయెత్తున కూంబింగ్ చేపట్టాయి.
ఆర్మీ, CRPF, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు పౌరులకు గాయాలైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.