భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో 10 మంది మృతిచెందారు. ఛత్తీసగఢ్ సుక్మా జిల్లాలోని కొంట భెజ్జీ దండకారణ్యంలో జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెల్లవారుజాము నుంచి ఇరువర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మృతుల్ని గుర్తించాల్సి ఉందని SP కిరణ్ చవాన్ అన్నారు.
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల జంక్షన్ గా భావించే ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరగ్గా.. భారీగా ఆయుధాలు రికవరీ చేశారు. ఛత్తీస్ గఢ్ నుంచి ఒడిశాకు మావోయిస్టులు వెళ్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(DRG) బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. గతేడాది కాలంగా జరుగుతున్న ఎన్ కౌంట్లర్లో ఇది కూడా పెద్దదిగా నిలిస్తే.. మావోయిస్టుల మృతదేహాలు సుక్మాకు తరలిస్తున్నారు.