ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లాలో మరోసారి భారీయెత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే కనపడుతోంది. ఈ ఎన్ కౌంటర్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గంగలూరు పరిధిలోని దండకారణ్యంలో పోలీసులు కూంబింగ్ చేపడుతున్నారు. తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులతో అటవీప్రాంతం దద్దరిల్లుతోంది.