తుపాకుల గర్జనలతో దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయారు. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మఢ్ అడవుల్లో భద్రతా దళాలు, జవాన్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మృత్యువాత పడితే మరో ఇద్దరు గాయపడ్డారు.
గత రెండ్రోజుల నుంచి మాడ్ అనే ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నారాయణపూర్-కొండగావ్-కాంకేర్-దంతెవాడ డీఆర్జీ పరిధిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్(STF), ఐటీబీపీ(Indi-Tibetan Border Police) బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గత నెలలో బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లోనూ 12 మంది నక్సల్స్ మృతిచెందారు.