ఓటింగ్ లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రికి వింత ఘటన ఎదురైంది. పోలింగ్ కేంద్రానికి వచ్చినా ఓటు వేయలేని పరిస్థితుల్లో మళ్లీ వస్తానంటూ తిరిగి వెళ్లిపోయిన ఘటన మిజోరాం రాష్ట్రంలో జరిగింది. అక్కడి CM జొరాంతంగ.. ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాజధాని ఐజ్వాల్ లోని YMA పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటు వేస్తారనుకున్న సమయంలో EVM(Electronic Voting Machine) మొరాయించడంతో వెనుదిరిగారు.
కొద్దిసేపు పోలింగ్ కేంద్రం(Polling Centre) వద్దే వేచి చూసిన ఆయన ఇక సమస్య పరిష్కారం కావడం లేదని గుర్తించి టిఫిన్ చేసి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయారు.