ఆమె బాక్సింగ్ మాజీ వరల్డ్ ఛాంపియన్.. భర్త కబడ్డీ ప్లేయర్.. విడాకుల వ్యవహారం కాస్తా చేయి చేసుకునేదాకా వెళ్లింది. హరియాణాలోని హిసార్ పోలీస్ స్టేషన్లో భర్త దీపక్ నివాస్ హుడాపై భార్య సవీటి బూరా(Saweety Boora) దాడి చేసింది. అర్జున అవార్డు గ్రహీత సవీటి.. కోటి నగదు, SUV కారు డిమాండ్ చేశాడని ఆరోపించింది. ఫిబ్రవరి 25న కేసు వేసి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ జంట మొదటిసారి ఓ మారథాన్ లో కలుసుకోగా, పరిచయం ప్రేమగా మారి 2022 జులై 7న పెళ్లి పీటలెక్కింది. ఏషియాడ్ కబడ్డీ ఈవెంట్లో హుడా కాంస్య పతకం అందుకున్నాడు. విచారణకు రెండుమూడు సార్లు పిలిచినా అతడు PSకు వెళ్లలేదు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి బాక్సర్ ఒక్కసారిగా భర్తపై దాడికి దిగింది.