రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చి ఢీకొట్టిన ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 46 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పశ్చిమబెంగాల్లోని న్యూజల్పాయ్ గురి(New Jalpaiguri) నుంచి సీల్దా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. త్రిపుర రాజధాని అగర్తల(Agartala) నుంచి సీల్దా(Sealdah) వెళ్తున్న కాంచనఝంగా ఎక్స్ ప్రెస్ ను.. న్యూజల్పాయ్ గురి స్టేషన్ కు అత్యంత సమీపంలోని రంగపాణి స్టేషన్ వద్ద గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టింది.
గూడ్స్ రైలు ఢీకొట్టిన ధాటికి కాంచనఝంగా ఎక్స్ ప్రెస్ రెండు బోగీలు చెల్లాచెదుర(Derailed)య్యాయి. ఒకే ట్రాక్ పై వెళ్తుండగా గూడ్స్ వెనుక నుంచి ఎక్స్ ప్రెస్ ను తాకింది. ఘటనాస్థలిలో NDRF, SDRF, రైల్వే పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారని, బాధితుల్ని ఆదుకుంటామని పరిస్థితిని పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. అనంతరం ఆయన ఘటనాస్థలికి వెళ్లారు.
ఏడాది వ్యవధిలో 4…
ఈ ఏడాదిలో ఇది నాలుగో ప్రమాదం. వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్లు రైల్వే శాఖకు ఇబ్బందికరంగామారుతున్నాయి. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ దుర్ఘటనలో 293 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అక్టోబరులో విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొని 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ నెల 2న పంజాబ్ లోని ఫతేగఢ్ సాహెబ్ ప్రమాదంలో ఇద్దరు గాయపడితే.. ఈరోజు ఐదుగురు మరణించారు.