పంజాబ్ ఎయిర్ బేస్(Air Base) స్టేషన్ పై దాడికి యత్నించింది పాక్. పొద్దున 8:40 గంటలకు హైస్పీడ్ మిసైల్ తో దాడికి దిగినట్లు కర్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. దీన్ని కూల్చేయడంతో శకలాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. శ్రీనగర్, ఉధంపూర్, భటిండా ప్రాంతాల్లో పాక్ వరుస దాడులు చేస్తోంది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, అఖ్నూర్ సెక్టార్లపై మోటార్లతో దాడికి యత్నించగా, మన టెక్నాలజీ అడ్డుకుందన్నారు. ఉధంపూర్ ఆర్మీ బేస్ ధ్వంసం చేసినట్లు వస్తున్న వార్తలు తప్పు అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. భారత ఆర్మీ బేస్ లకు ఎక్కడా నష్టం జరగలేదని, పుకార్లు నమ్మొద్దని ప్రజల్ని కోరారు.