మహారాష్ట్ర(Maharastra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆశ్చర్యకరంగా మాట్లాడారు. తన ప్రభుత్వంలో డిప్యూటీ CMగా ఉన్న అజిత్ పవార్ ను.. ఏదో ఒకరోజు CM అవడం ఖాయమన్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే ఆయన ఇలా మాట్లాడారు. ‘ఉదయించే సూర్యుడిలా వేకువజాము నుంచే పవార్ పనిచేస్తుంటారు.. మధ్యాహ్నం 12 నుంచి అర్థరాత్రి వరకు నేను చూసుకుంటా.. ఇక రాత్రి నుంచి తెల్లవారేదాకా మరో డిప్యూటీ CM షిండే చూసుకుంటారు.. అజిత్ పవార్ ను అందరూ పర్మినెంట్ డిప్యూటీ CM అంటారు.. ఆయన ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు.. అందుకు నా సహకారం తప్పకుండా ఉంటుంది..’ అంటూ ఫడ్నవీస్ తన అభిమానాన్ని చాటుకున్నారు.
2023లో శరద్ పవార్ నేతృత్వంలోని NCP నుంచి బయటకు వచ్చిన అజిత్.. BJP నేతృత్వంలోని మహాయుతి కూటమిలో చేరారు. గత ప్రభుత్వంలోనూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన.. ఈ నెల 5న ఆరోసారి డిప్యూటీ CMగా ప్రమాణం చేశారు. మొన్నటి ఎన్నికల్లో 57 చోట్ల పోటీ చేసిన NCP 41 స్థానాల్ని గెలుచుకుంది.