GST సంస్కరణలతో భారీగా ధరలు తగ్గుతున్నాయి. మరి మద్యం(Liquor)ను కూడా GSTలోకి తెస్తారా, రేట్లు దిగొస్తాయా అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు ప్రశ్న ఎదురైంది. దీనికామె… ‘ఎక్సైజ్ సుంకాలు, వ్యాట్ వేసుకునే రాష్ట్రాలు.. GSTలోకి రావాలనుకోవడం వారిష్టం. దీనిపై నేనేం మాట్లాడను..’ అని దాటవేశారు. ఢిల్లీలో పన్నులతోనే రూ.5,069 కోట్లు లభించింది. పాలపై వచ్చిన రూ.210 కోట్ల కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఆల్కహాల్ ను GST నుంచి మినహాయించారు. ఎక్సైజ్, వ్యాట్, సెస్, సర్ ఛార్జీల్ని రాష్ట్రాలు వేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పన్నులే 60% ఉండగా, GST శ్లాబులతో పోలిస్తే చాలా ఎక్కువ.