సాంకేతిక సమస్యతో విమానాన్ని 14 గంటలు ఆలస్యం చేసిన సంస్థ.. ప్రయాణికుడికి ఒక బర్గర్, ప్రైస్ మాత్రమే ఇచ్చింది. దీనిపై వినియోగదారుల కమిషన్ ఆ సంస్థకు రూ.55 వేలు ఫైన్ వేసింది. ఫిర్యాదుదారుడు 2024 జులై 27న దుబాయ్ నుంచి ముంబయికి స్పైస్ జెట్(Spice Jet) ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. బాగా ఆలస్యం జరిగినా సరైన ఏర్పాట్లు చేయలేదని కమిషన్ గుర్తించింది. వేచి ఉండే టైంను బట్టి భోజనం, విశ్రాంతి అందించాలని.. రద్దు, ఆలస్యం, రీ-షెడ్యూల్ వంటి కారణాలతో తప్పించుకోలేవని స్పష్టం చేసింది. బాధ, అలసట పేరుతో రూ.4 లక్షలు ఇప్పించాలని బాధితుడు కోరారు. కానీ రూ.50 వేల పరిహారం, రూ.5 వేలు పిటిషన్ ఖర్చుగా చెల్లించాలని ముంబయి సబర్బన్ కమిషన్ ఆదేశించింది.