ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ(Narendra Modi) సౌత్ బ్లాక్ లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే మొదటి ఫైల్ పై సంతకం చేశారు. ఈ సంతకం రైతుల సంక్షేమాని సంబంధించినది కాగా.. PM కిసాన్ నిధి 17వ విడత(Phase) నిధుల్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.
రూ.20 వేల కోట్లు…
దీనివల్ల దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుండగా రూ.20,000 కోట్లు పంపిణీ అవుతాయి. తమది కిసాన్ కళ్యాణ్ కు కట్టుబడి ఉన్న ప్రభుత్వమని, అందుకే తొలి సంతకాన్ని రైతు సంక్షేమానికి సంబంధించిన అంశంపై చేశానని మోదీ గుర్తు చేశారు. రానున్న కాలంలో రైతులతోపాటు వ్యవసాయ రంగాన్ని(Agriculture Sector) మరింత అభివృద్ధి చేస్తామన్నారు.