చైనా సరిహద్దులో విషాదకర(Tragedy) ఘటన జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ(LAC) సమీపంలో ఆకస్మిక వరదలు వచ్చాయి. న్యోమా-చుషుల్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున తలెత్తిన వరదల్లో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు లద్దాఖ్ లోని సేసర్ బ్రాంగ్సాకు దగ్గర్లో ష్యోక్ నది వద్ద భారత సైన్యం(Indian Army) విన్యాసాలు చేస్తున్న సమయంలో వరద(Flood) పోటెత్తింది.
నదిలో యుద్ధ ట్యాంక్ ఇరుక్కుపోవడంతో ఐదుగురు అందులోనే చిక్కుపోయారు. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(JCO)తోపాటు నలుగురు ఇతర ర్యాంకుల జవాన్లు ఉన్నారు. వీరి పార్థివదేహాలు T-72 ట్యాంక్ అనే వాహనం వద్ద గుర్తించారు. LACకి సమీపంలోని మందిర్ మోర్ ప్రాంతంలో అర్థరాత్రి 1 గంటకు వరద పోటెత్తింది.