
PHOTO: ZEE NEWS
హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తి భయానక వాతావరణం ఏర్పడింది. వర్షా ల ధాటికి 48 మంది ప్రాణాల్ని ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏడుగురు వ్యక్తులు సిమ్లాలోని ఆలయంలో శిథిలాల కింద సమాధి అయినట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. కొండచరియలు విరిగిపడటంతో ఎక్కడికక్కడ రోడ్లు మూసుకుపోయాయి. చాలా చోట్ల ఇళ్లు కూలడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. రాష్ట్ర రాజధాని సిమ్లా సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం వద్ద శిథిలాల కింద ఏడుగురు కూరుకుపోయి మృత్యువాత పడ్డారు. మరికొందరు అందులో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఉత్తరాదిలో నిర్వహించే సావన్ కార్యక్రమంలో భాగంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసేందుకు పెద్ద సంఖ్యలో శివాలయానికి తరలివచ్చారు.
రుషికేశ్ లో గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదతో భయంకర పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఫాగ్లి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి కూరుకుపోయిన ఐదు మృతదేహాలను బయటకు తీసినట్లు సిమ్లా SP సంజీవ్ కుమార్ తెలిపారు. మరో 17 మందిని రక్షించామన్నారు.