
అకస్మాత్తుగా వస్తున్న వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అటు వరదలు, ఇటు కొండ చరియలు విరిగిపడటంతో ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోలాన్ జిల్లా జాడోన్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు కొట్టుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ లో గత 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. అధికారులు ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. NDRF బృందాలు వందలాది మందిని సేఫెస్ట్(Safest) ప్లేసెస్(Places)కు తరలిస్తున్నాయి.
వరదలతోనే ఇలా ఉంటే కొండ చరియలు మరింత బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 15 రోజుల క్రితమే అల్లకల్లోలం సృష్టించగా ఇప్పుడు మరోసారి ఉప్పెన తలెత్తింది. దీంతో జనం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతకాల్సి వస్తున్నది.