ఒకే దేశం-ఒకే ఎన్నికల వ్యవస్థపై మాజీ CJIలు అభిప్రాయాలు తెలిపారు. ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారాలు ఇవ్వరాదంటూ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.ఎస్.ఖేహర్ JPCకి చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది. రాజ్యాంగ సవరణ చట్టంలోని అపరిమిత అధికారాల్ని ఇవ్వరాదన్నారు. మరో మాజీ CJI జస్టిస్ రంజన్ గొగోయ్ సైతం EC విస్తారమైన అధికారాల్ని ప్రశ్నించారు. ఎన్నికైన ప్రభుత్వానికి ఐదేళ్ల పదవీకాలం ముఖ్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించరాదని స్పష్టం చేశారు. తదుపరి ఎన్నికలకు 6 నెలల ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది కాబట్టి.. దాని పదవీకాలం ఏడాది లేదా అంతకంటే తక్కువుంటే సామర్థ్యం తగ్గినట్లేనని గతంలోనే జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. అంతకుముందు జస్టిస్ యు.యు.లలిత్ సైతం JPCతో భేటీ అయ్యారు.