కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాల్(Yatnal)ను పార్టీ నుంచి BJP బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరేళ్ల పాటు వేటు వేసింది. కమలం పార్టీలో రాచరిక పాలన నడుస్తోందని, అవినీతి పెరిగిందంటూ ఆయన కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఈ ఫిబ్రవరి 10న యత్నాల్ కు షోకాజ్ నోటీసులిచ్చారు. ప్రవర్తనలో మార్పు లేదని భావించిన సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ.. మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే నిజాలు మాట్లాడినందుకే నాకీ శిక్ష అంటూ బసనగౌడ ‘X’లో పోస్ట్ చేశారు.