అర్థరాత్రి గాఢ నిద్రలో ఉండగా ఉన్నట్టుండి నాలుగంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు ప్రాణాలు విడిచారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్(Mustafabad)లో జరిగిన ఘటనలో మరో 14 మందిని రక్షించారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2:50 గంటలకు పెద్ద ప్రమాదం సంభవించింది. ఫైర్ స్టేషన్ కు కాల్ రావడంతో అక్కడి సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు, NDRF దళాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీలో నిన్న వాతావరణం ఒక్కసారిగా మారి జోరుగా వర్షం పడింది. ఈ ప్రభావంతోనే బిల్డింగ్ కూలినట్లు భావిస్తున్నారు. ఆ దృశ్యాలు CC కెమెరాల్లో రికార్డయ్యాయి.