పేదల కోసమంటూ చాలా రాష్ట్రాలు అనర్హులకు రేషన్ కార్డులిస్తున్నాయని సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ఉచితాల పేరుతో గల స్కీంల వల్ల పేదలకే అన్యాయం జరుగుతోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. సంక్షేమ పథకాలు, పెన్షన్ల విషయంలో దేశమంతా ఒకే విధానం(System) ఉండాలన్నారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఉచితాల అమలుపై పార్లమెంటులో చర్చ జరగాలని పలువురు కోరుతున్నారు. ప్రజల్ని పరాన్నజీవుల్ని చేస్తున్నారని కార్డులు ఇచ్చినా, రేషన్ అందడం లేదన్నది సుప్రీం మాట. పేదల ఫలాలు ధనికులకే చేరుతున్నాయని, అనర్హమైనవి రద్దు చేయాలని ఆదేశాలిచ్చింది. అభివృద్ధి(Developed) చెందిన దేశాల్లో డైరెక్ట్ గా సబ్సిడీలు దక్కుతున్నాయి.