ఉపరాష్ట్రపతిగా సి.పి.రాధాకృష్ణన్ భారీ మెజార్టీతో గెలుపొందగా.. గత ఎన్నికలకు భిన్నంగా ఓట్లు పెరిగాయి. NDA పక్షాలకు తోడు ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు ఓట్లు వేయడంతో 152 ఓట్ల ఆధిక్యం సొంతమైంది. 767 ఓట్లు పోలైతే NDAలోని పార్టీలవే 427 వచ్చాయి. వీరితోపాటు YSRCP, ఇతర చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లతోపాటు నామినేటెడ్ MPలతో NDA బలం 452 అయింది. ఇందులో తమిళనాడుకు చెందిన MPలు రాధాకృష్ణన్ కు ఉన్న పరిచయంతో ఆయనకే సహకరించినట్లు భావిస్తున్నారు. జగదీప్ ధనఖడ్ ఎన్నికతో పోలిస్తే ఈసారి ఓట్ల శాతం పెరిగింది.