తెలంగాణలో సంచలన సృష్టించిన న్యాయవాద దంపతుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. గట్టు వామనరావు దంపతుల హత్య కేసును CBIకి అప్పగించింది. ఈ విషయంలో తమకు అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీం జారీచేసిన నోటీసులపై స్పష్టం చేయడంతో CBIకి అప్పగించింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద గట్టు వామనరావు, పి.వి.నాగమణి ప్రయాణిస్తున్న కారును ఆపి కత్తులతో పొడిచి హత్య చేశారు. మరణ వాంగ్మూలాన్ని FSL ధ్రువీకరించింది. అయితే రాష్ట్ర పోలీసుల దర్యాప్తు బాగానే ఉందంటూ హైకోర్టు అప్పట్లో సంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో BRS MLA హస్తం ఉందని ఆరోపణలు రాగా.. అప్పుడు ఆ పార్టీనే అధికారంలో ఉంది. దీంతో ఈ కేసును CBIతో విచారణ జరిపించాలంటూ ఆయన తండ్రి కృష్ణారావు 2021 సెప్టెంబరులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.