లోక్ సభ, నాలుగు రాష్ట్రాల శాసనసభ(Assembly) ఎలక్షన్లను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ప్రకటించిన దృష్ట్యా… సార్వత్రిక ఎన్నికల్లో నేడు తొలి నోటిఫికేషన్ రానుంది. మొత్తంగా 21 రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో(Union Territories)ని 102 లోక్ సభ స్థానాలకు నామినేషన్ల పర్వం మొదలవుతుంది. నోటిఫికేషన్ రాగానే నామినేషన్ల కార్యక్రమం స్టార్ అవుతుండగా, ఈనెల 27 వరకు ఫస్ట్ ఫేజ్ నామినేషన్లకు గడువు ఉంది.
ఆ రాష్ట్రాలివే…
ఈనెల 28న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, ఇప్పుడు నామినేషన్లు తీసుకునే 102 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. తొలి విడత(First Phase)లో పోలింగ్ జరిగే నియోజకవర్గాలు అత్యధికంగా తమిళనాడులో 39 ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన లక్ష్యద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ సహా ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మిజోరాం, సిక్కిం, త్రిపురతోపాటు జమ్మూకశ్మీర్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.