దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్(General Elections)కు కొన్ని రాష్ట్రాల్లో మంచి స్పందన(Good Response) వస్తున్నది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోనే భారీస్థాయిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రెండు రాష్ట్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 50 శాతం దాకా పోలింగ్ నమోదైంది. త్రిపుర(Tripura)లో దేశంలోనే అత్యధికం(Highest)గా 53.04 ఓట్లు పడ్డాయి.
ఉద్రిక్తతల రాష్ట్రంగా పేరుపడ్డ పశ్చిమబెంగాల్లోనూ 50.96 శాతం పోలింగ్ రికార్డయింది. ఇక 45 శాతం దాటిన/చేరిన రాష్ట్రాలు నాలుగు ఉన్నాయి. మేఘాలయలో48.18% మణిపూర్లో 45.68% అసోంలో 45.12%, పుదుచ్చేరిలో 44.95% మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా మధ్యాహ్నం వరకు అత్యధిక పోలింగ్ నమోదైన ఐదు రాష్ట్రాల్లో నాలుగు(త్రిపుర, మేఘాలయా, అసోం, మణిపూర్) ఈశాన్య రాష్ట్రాలే ఉండటం విశేషంగా నిలిచింది.