పంద్రాగస్టు నాడు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని ప్రకటించిన విధంగా భారీ మార్పులకు GST కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. 5%, 18% మాత్రమే ఉంచి, 12%, 28% శ్లాబుల్ని తొలగించాలని నిర్ణయించింది. సిగరెట్లు, పొగాకు వంటి విలాస వస్తువులపై 40% పన్ను ఉంటుంది. కొత్త శ్లాబులు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయి. చాలా ఆహార పదార్థాలతోపాటు 33 రకాల మెడిసిన్స్ పై ఇక GST ఉండదు. వ్యవసాయ పరికరాలు 12 నుంచి 5%.. ఫర్టిలైజర్స్, ఎరువులు 18 నుంచి 5%.. సిమెంట్ 28 నుంచి 18% శ్లాబుల్లోకి వస్తాయి. అన్నిరకాల వ్యక్తిగత, జీవిత బీమా పాలసీలకు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు నిర్మల సీతారామన్ తెలిపారు.
Good Coverage