శ్రావణ మాస పూజల కోసం భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 35 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్ హరిద్వార్(Haridwar)లోని మన్సాదేవి గుడిలో ఘటన జరిగింది. మెట్లు ఎక్కుతుండగా కరెంటు షాక్ కొట్టిందంటూ ఒక్కసారిగా వదంతలు(Rumors) వ్యాపించాయి. ఏదో అయిపోతుందంటూ ప్రచారం జరగడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. శివ భక్తులకు ప్రఖ్యాతి గాంచిన హరిద్వార్.. గంగాజలం కోసం వేలాదిగా తరలిరావడంతో కిక్కిరిసిపోయింది.